News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
TODAY HEADLINES

*దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోవు: మోదీ
*ఏపీ కొత్త మ్యాప్ విడుదల
*₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN
*ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: రేవంత్
*అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ
*రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
*48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే ప్రళయమే: ట్రంప్
*IPL: ముంబైపై ఢిల్లీ, గుజరాత్‌పై రాజస్థాన్ గెలుపు
News April 5, 2026
ఈవెంట్‌లో సినీతారలు.. మరోసారి డ్రగ్స్ కలకలం

TG: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ తారామతి రిసార్టులో జాక్ జాన్సన్ ఈవెంట్‌పై ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పలువురు సినీతారలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇందులో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
News April 5, 2026
ఈ నెల 6- 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు

ఏప్రిల్ 6- 11 వరకు నగరవ్యాప్తంగా భారీ ఆరోగ్య వారోత్సవాలు జరగనున్నాయి. నెక్లెస్ రోడ్‌లో ‘ఈట్ రైట్ వాక్’తో మొదలై, నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాల ప్రారంభం, రవీంద్రభారతిలో AI సాంకేతికతతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటాయి. ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం, గాంధీ ఆస్పత్రిలో డీ అడిక్షన్ కేంద్రం షురూ అవుతాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తారు.


