News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 21, 2025

రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయం: CM

image

రాజయ్య పేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్ ఏర్పాటు చేయమని CM చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో మత్స్యకారులు అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం వారికి మాట్లాడే అవకాశం కూడా CM ఇవ్వలేదు. CMతో భేటీకి 30 మందిని అధికారులు శనివారం తాళ్లపాలెం తీసుకెళ్లారు. CM వారితో 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. గ్రామస్థులు చేసిన ఆందోళన.. వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.

News December 21, 2025

ఇకపై ‘మనమిత్ర’లోనే ఆర్జిత సేవా టికెట్లు

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

News December 21, 2025

NZB: 9 నెలల పసికందు విక్రయం.. ఇద్దరిపై కేసు

image

9 నెలల బాబును విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ ఉంటున్నారు. వారి వద్ద ప్రస్తుతం బాబు కనిపించకపోవడంతో విక్రయించినట్లు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు వెళ్లింది. వారు విచారణ జరిపి నిర్దారించారు. సీమ, షరీఫ్‌పై కేసు నమోదు చేశారు.