News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 14, 2026
ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.
News April 14, 2026
సీఎం పదవికి నితీశ్ రాజీనామా

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్‌కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
News April 14, 2026
వికారాబాద్: రూ.500కే 50 కిలోల బస్తా..!

ఉల్లి రైతులకు జిల్లాలో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేంలేక VKB పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి ట్రాక్టర్లతో ఉల్లిని తెచ్చి విక్రయిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు.


