News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
మెడలు పట్టి గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదు: ఈటల

TG: తాను BRSలోకి వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎలాంటి తప్పు చేయకున్నా మెడలు పట్టి బయటకు గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే BRS నుంచి బర్తరఫ్ చేశారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం బాధించిందన్నారు.
News April 5, 2026
జిల్లలో తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు: ఎస్‌ఈ

కర్నూల్ జిల్లా గోకులపాడులో పీఎం సూర్య ఘర్ ఉత్సవ్‌ను విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్లాలో 23,077 గృహాలకు మంజూరు కాగా, తొలి దశలో సుమారు 6,000 గృహాల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
News April 5, 2026
GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.


