News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 14, 2025

MP-IDSAలో ఉద్యోగాలు

image

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్(MP-IDSA)లో 9 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ ఫెల్లో, అసోసియేట్ ఫెల్లో, రీసెర్చ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.idsa.in

News December 14, 2025

కామారెడ్డి జిల్లాలో సర్పంచిగా తొలి విజయం

image

గాంధారి మండలం తిప్పారం సర్పంచిగా మధుసూదన్ రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 36 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. తిప్పారం పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకుని గాంధారి మండలంలో సర్పంచిగా గెలిచి బోణి కొట్టారు. ఇది వరకే 8 వార్డు సభ్యులు ఇక్కడ ఏకగ్రీవమయ్యారు.

News December 14, 2025

MNCL: పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల మానవీయత

image

మంచిర్యాల జిల్లాలో ఇవాళ జరిగిన రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల మానవీయత పలువురి ప్రశంసలు అందుకుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, మహిళలు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పోలీసులు సహాయం అందించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతతో పాటు ఓటర్లకు చేయూత అందించి వారు సురక్షితంగా ఓటు వినియోగించుకునేందుకు పూర్తి సహకారం అందించారు.