News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 16, 2025

FLASH.. ములుగు: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

image

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్‌ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతోపాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.

News December 16, 2025

‘పోలవరం-నల్లమలసాగర్’పై SCలో TG పిటిషన్

image

AP చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై TG ప్రభుత్వం SCలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని నిలువరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. గోదావరి నీటి తరలింపుతో TGకి నష్టం వాటిల్లుతుందని తెలిపింది. కాగా ఈ ప్రాజెక్టుపై AP ఇప్పటికే SCలో కేవియెట్ పిటిషన్ వేసింది. గతంలో ‘పోలవరం-బనకచర్ల’ DPRను TG అభ్యంతరంతో కేంద్రం వెనక్కు పంపింది. తాజాగా దానిని కొంత సవరించి తాజా లింకు ప్రాజెక్టుకు AP నిర్ణయించింది.

News December 16, 2025

MNCలు కాదు.. చిన్న కంపెనీలే మంచివి

image

AI రంగంలో జాబ్ కోరుకునేవారు MNCల కంటే చిన్న, మధ్య తరహా కంపెనీలను ఎంచుకోవాలని US బిలియనీర్ మార్క్ క్యూబన్ యువ ఇంజినీర్లకు సలహా ఇచ్చారు. చిన్న సంస్థల్లో వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని, పెద్ద కంపెనీల్లో అలా కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం AIలో ఇన్వెస్ట్ చేసిన చాలా కంపెనీలకు లాభాలు రావట్లేదని, అయితే స్టార్టప్‌లు ముందంజలో ఉన్నాయన్నారు. యువత AI నేర్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు.