News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 5, 2026

వరంగల్‌కు ఏమైంది? ఎందుకీ హత్యలు, ఆత్మహత్యలు?

image

ఉమ్మడి వరంగల్‌లో దారుణాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో కొందరు, ఆడ పిల్లలు పుట్టారని మరికొందరు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారు. బిడ్డ కడుపులో ఉండగానే పలు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేయిస్తున్నారు. తాజాగా భార్య, <<19561605>>ఇద్దరు కూతుళ్లను పున్నేలులో<<>> భర్త చంపితే.. బోడ మాణిక్యతండా, వర్ధన్నపేటలో భార్యభర్తల మధ్య గొడవలకారణంగా పిల్లలతో కలిసి తల్లులు సూసైడ్ చేసుకున్నారు.

News April 5, 2026

నక్కపల్లిలో యాక్సిడెంట్.. VZM వాసి దుర్మరణం

image

అనకాపల్లి (D) నక్కపల్లి(M) వెదుళ్లపాలెం హైవేపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. VZM(D) గంట్యాడ(M) గింజేరుకు చెందిన పదిమంది గురువారం ఒంగోలులో ఫంక్షన్లకు వెళ్లి వ్యాన్‌లో తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆర్.రామ్మూర్తి మృతి చెందాడు. శాంతి, దేవి, దుర్గమ్మ, రామలక్ష్మి, లక్ష్మి గాయపడినట్లు ఎస్సై సన్నిబాబు తెలిపారు.

News April 5, 2026

పాలమూరు: ప్రేమించి పెళ్లి.. వేధించి ప్రాణం తీశాడు!

image

ప్రేమ వివాహం చేసుకున్న భార్యనే భర్త కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. MBNR జిల్లా మూసాపేట (M) పోల్కంపల్లికి చెందిన చందు 8 నెలల క్రితం శ్రీదేవి(19)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా జరగడంతో ఆమెను కొట్టి హత్య చేశాడు. చందు వరికోత మిషన్ డ్రైవర్‌గా, ఆమె నర్సుగా పని చేస్తున్నారు. మూసాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.