News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 14, 2025

ధర్మసాగర్: సర్పంచులు వీరే!

image

ధర్మసాగర్ మండలం ధర్మపురంలో BRS బలపరిచిన అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. అలాగే దేవునూరు గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి ఇంగె రవి గులాబీ జెండా ఎగరేశారు. మరోవైపు కరుణాపురంలో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ BRS బలపరిచిన అభ్యర్థి గుర్రపు రీనా గెలుపు ముంగిట నిలిచారు. కడియం శ్రీహరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం పట్ల BRS నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 14, 2025

ఎన్టీఆర్: రేపు పోలీస్ గ్రివెన్స్ రద్దు

image

విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ అధికార యంత్రాంగం భవాని ఉత్సవాల విరమణ కార్యక్రమంలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలందరూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదులు నిమిత్తం రావద్దని సూచించారు.

News December 14, 2025

సీసీ కుంట నూతన సర్పంచులు వీరే !

image

అల్లిపూర్ శారదమ్మ
అమ్మాపూర్ – రంజిత్ కుమార్
బండార్ పల్లి – బత్తుల సుజాత
వడ్డేమాన్ – స్వప్న
సీసీ కుంట మానస – దమాగ్నాపూర్ పావని
ఏదులాపూర్ – ఆంజనేయులు
ఫర్దిపూర్ – శివకుమార్
గోప్య నాయక్ తండా – రాములు
గూడూరు – భీమన్న
లాల్ కోట – గోపాల్
మద్దూరు – దామోదర్
నెల్లికొండి – సుకన్య
పల్లమర్రి – లక్ష్మీ
సీతారాంపేట – హుస్సేన్ జీ
ఉంద్యాల -ఆంజనేయులు.