News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.
News December 15, 2025
HYD: నిజాం నీడలో నలిగిన తెలంగాణ: చిల్లర దేవుళ్లు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ గ్రామీణం ఎదుర్కొన్న అణచివేతలను దాశరథి రంగాచార్యులు <<18569096>>చిల్లర దేవుళ్లు<<>>లో హృదయవిదారకంగా చిత్రించారు. దొరలు, కర్ణం వ్యవస్థ, భూస్వాములు, వెట్టిచాకిరీ, మతమార్పిడులు, స్త్రీల వేదనల జీవితం కళ్లముందు కదులుతున్నట్లే ఇందులో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నాటి దుర్భర సామాజిక పరిస్థితులను చరిత్రగా అక్షరీకరించారు. ఈ నవల చదువుతున్నంత సేపు నాటి సమాజంలో ఉన్నట్లే ఉంటుంది.


