News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి 89 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ గణేష్, ఆర్డీఓ రమేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 16, 2026

సూర్యాపేట: ‘ఈ విజయం దామన్నకే అంకితం’

image

సూర్యాపేట మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపిక కావడంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి పూల సెంటర్, పొట్టి శ్రీరాముల సెంటర్ వరకు జరుగుతున్న విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్ర పటాలను చేత పట్టుకొని ర్యాలీలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విజయం ఆయనకే సొంతం అంటూ నినాదాలు చేశారు.

News February 16, 2026

పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పన్నుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. కోట్లాది రూపాయల పన్నులు పెండింగ్‌లో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీనెల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.