News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
ఐటీడీఏలో పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన జేసీ

పార్వతిపురం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జేసి మాట్లాడుతూ..ఆయన త్యాగ ప్రతిఫలంగానే ఏపీ అవతరించిందని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన త్యాగాన్ని తప్పక స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
News December 15, 2025
విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132 ఉండగా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 ఉన్నాయి.
News December 15, 2025
CSIR-UGC NET అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి

<


