News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 14, 2025
వార్డ్‌రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్‌రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్‌రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్‌రోబ్ నీట్‌గా కనిపిస్తుంది.
News December 14, 2025
జగిత్యాల: ఒంటిగంట వరకు పోలింగ్ శాతం వివరాలు

జగిత్యాల జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు. బీర్పూర్ మండలంలో 80.25%, జగిత్యాల మండలంలో 80.89%, జగిత్యాల రూరల్ మండలంలో 74.99%, కొడిమ్యాల మండలంలో 77.03%, మల్యాల మండలంలో 60.02%, రాయికల్ మండలంలో 78.56%, సారంగాపూర్ మండలంలో 77.52% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉందన్నారు.
News December 14, 2025
VKBలో 78.31 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒంటి గంట వరకు 78.31 పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వికారాబాద్ డివిజన్‌లో ఏడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్‌లో 1 గంటల వరకు 78.31 పోలింగ్ నమోదు కాగా 2,09,847 మంది ఓటర్లకు 1,64,330 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అక్కడ ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో ఓటర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడించనున్నారు.


