News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 23, 2025

వరంగల్‌లో రివేంజ్ షురూ..!

image

రోజులు ఒకేలా ఉండవు. ఒక్కో నేతకు ఓ రోజు వస్తుంది. WGL తూర్పులో అదే జరుగుతోంది. ఇన్నాళ్లూ పోలీసులను పెట్టుకొని సాధించిన నేతకు, మరో మాజీ మంత్రి షాక్‌లు ఇస్తున్నారు. WGL ACPగా పని చేసిన నందిరాం నాయక్, CI గోపీ, SI విఠల్‌ను DGP సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. పాత కేసులను తవ్వి మరీ వారిపై వేటు పడేలా చేశారు. కాంగ్రెస్ నేతలనే స్టేషన్లలో నిర్భంధించి కొట్టిన ఘటనలు, ఈ వేటు పడడానికి కారణమని తెలుస్తోంది.

News December 23, 2025

రూ.118 కోట్లలో సగం చెల్లించాల్సిందే.. ‘గీతం’కు హైకోర్టు షాక్

image

TG: హైకోర్టు ఆదేశాలతో HYD <<18584831>>గీతం<<>> యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని ఇటీవల వర్సిటీకి డిస్కం నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.

News December 23, 2025

సింహాచలం: ఆన్‌లైన్లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

image

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు.www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.