News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 1, 2026
మామిడి పూత విడిగినప్పుడు మందుల పిచికారీ వద్దు

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో తేనెటీగలు ఎక్కువగా తిరుగుతూ ఫలదీకరణకు సహాయపడతాయి. అందుకే ఈ దశలో చెట్లకు ఎలాంటి మందులు స్ప్రే చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మందులను పిచికారీ చేస్తే పిందె ఏర్పడడానికి అవసరమయ్యే పుప్పొడి కొట్టుకుపోతుంది. అలాగే పిందె ఏర్పడటానికి సాయం చేసే తేనేటీగలు కూడా రసాయనాల వల్ల చనిపోతాయి. ఫలితంగా ఫలదీకరణ సరిగా జరగక పిందె సరిగా కట్టదు.
News January 1, 2026
MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 1, 2026
కర్నూలులో స్పెషల్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

కర్నూలు జిల్లాలో ఆరోగ్యం, విద్య, సంక్షేమ వసతి గృహాల ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం నూతన కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4299కు వచ్చిన 109 కాల్స్‌లో ఇప్పటికే 99 సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


