News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 98 సమాధానం

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
సమాధానం: జరాసంధుడు
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 16, 2025
ఢిల్లీలో నిరసన తెలిపిన పెద్దపల్లి ఎంపీ

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పును నిరసిస్తూ పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నేడు నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగంపై దాడి అని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఇది సంస్కరణ కాదు రాజకీయ ప్రతీకారమే అని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా గాంధీజీ పేరు అంటే బీజేపీకి ఎందుకింత భయం అని ప్రశ్నించారు.
News December 16, 2025
చంద్రబాబు ఇచ్చిన DSC నోటిఫికేషన్‌తో టీచర్ అయ్యా: హోంమంత్రి

AP: చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి ఏడాది డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘చంద్రబాబు 2002లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌తో నేను టీచర్ అయ్యాను. ఇప్పుడు ఆయన క్యాబినెట్‌లోనే మంత్రిగా ఉండటం నా అదృష్టం. పోలీసు యూనిఫామ్ పవర్ కాదు.. బాధ్యత. కానిస్టేబుల్ పోస్టుల్లో రికమెండేషన్‌లు, పొరపాట్లకు తావు లేకుండా టెక్నాలజీని ప్రవేశపెట్టాం’ అని నియామకపత్రాల పంపిణీలో చెప్పారు.


