News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 28, 2026

మద్యం మత్తులో వాహనం నడిపితే జైలుకే: SP

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు చేపట్టిన తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కోర్టు కఠినంగా స్పందించింది. సోమవారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 38 మందిని కోర్టులో హాజరుపరచగా, వారికి జైలు శిక్షలతో పాటు జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

News January 28, 2026

సిద్దిపేట: ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్-1, 2, 3, 4తో పాటు ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, పోలీస్ ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రవినాథ్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నిపుణులతో కోచింగ్ అందిస్తామని, ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 28, 2026

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి సవిత

image

AP: త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి సవిత తెలిపారు. BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో BC అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది BC అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.