News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

image

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.

News February 17, 2026

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం!

image

ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఏఐ సమ్మిట్‌లో నిర్వహణ, ఏర్పాట్లపై గందరగోళం నెలకొంది. తమ ఆవిష్కరణను ప్రదర్శించేందుకు వచ్చిన ఓ స్టార్టప్ ఫౌండర్‌కు నిన్న చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని విజిట్ నేపథ్యంలో సెక్యూరిటీ సూచన మేరకు తమ డివైజ్‌లు అక్కడ విడిచి వెళ్లామని.. తిరిగొచ్చేసరికి అవి చోరీకి గురయ్యాయని వాపోయారు. మరోవైపు క్రౌడ్ మేనేజ్మెంట్, ఏర్పాట్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News February 17, 2026

శ్రీకాకుళం: బాలికతో అసభ్య ప్రవర్తన.. ఏడాది జైల్లోనే

image

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మందస(M) ఓ గ్రామానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన కొర్రాయి తిరుపతి రెండేళ్లుగా వెంటపడుతూ, బాలిక పాఠశాల నుండి వస్తున్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లితండ్రులు ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదయినట్లు చెప్పారు.