News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 20, 2025

కొడంగల్: ‘క్రిస్మస్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి’

image

ఈనెల 24న కొడంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని అధికారులు వెల్లడించారు. పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని వారు తెలిపారు.

News December 20, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం రోడ్డు భద్రత మాసోత్సవాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని.. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News December 20, 2025

సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ: మంత్రి పొన్నం

image

సురక్షిత డ్రైవింగ్ విధానంతో రహదారి ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ డిజి మహేష్ భగవత్‌లతో కలిసి హైదరాబాద్ నుంచి రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.