News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 9, 2026
ఎల్బీనగర్ – ఖమ్మం మధ్య ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్బీనగర్ నుంచి ఖమ్మంకు నేడు, రేపు ప్రత్యేక నాన్-స్టాప్ డీలక్స్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10:30 గంటల వరకు మొత్తం 8 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News January 9, 2026
BCCIతో వార్.. బంగ్లా ప్లేయర్ల ఆదాయానికి గండి!

BCCIతో వివాదానికి తెరలేపిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) అసలు సెగ తగలనుంది. భారత్‌లో సెక్యూరిటీపై అనుమానాలు, IPL ప్రసారాల నిలిపివేత వంటి నిర్ణయాలకు నిరసనగా మన దేశీయ స్పోర్ట్స్ బ్రాండ్లు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ బంగ్లా ప్లేయర్లతో ఉన్న బ్యాట్ స్పాన్సర్‌షిప్ డీల్స్‌ను ఇండియన్ కంపెనీ ‘SG’ రద్దు చేసుకునే యోచనలో ఉంది. ఇదే బాటలో మరిన్ని బ్రాండ్లూ నడిచేలా ఉన్నాయి.
News January 9, 2026
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల ఎస్పీ సునీల్ షోరాణ్, ఈవో శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. గతేడాది కంటే మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


