News January 24, 2026

క్రెడిట్ చోరీయా… జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: CBN

image

AP: జగన్ చేసిన పనుల్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ వినాశనమే అని CM CBN హెచ్చరించారు. ‘తన మనుషుల్ని పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్‌తో భూమి కాజేసే ప్రయత్నం చేశారు. చివరకు దేవునికిచ్చిన నెయ్యినీ కల్తీ చేశారు. రాక్షసపాలన సాగించారు. తప్పుడు కేసుతో నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిని అడ్డుకుంటున్నారు. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్త’ అని సూచించారు.

Similar News

News February 19, 2026

రైతులను పెళ్లాడే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి.. MLA అభ్యర్థన

image

కర్ణాటకలో INC MLA రంగనాథ్ ఓ వినూత్న ప్రతిపాదనతో CM సిద్దరామయ్యకు లేఖ రాశారు. రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న కునిగల్ సెగ్మెంట్‌లో మెజార్టీ ఫ్యామిలీలకు అగ్రికల్చరే జీవనోపాధి. అక్కడ వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావట్లేదు. దీంతో చాలామంది 30ఏళ్లు దాటినా ఒంటరిగానే మిగిలిపోతున్నారు’ అని పేర్కొన్నారు.

News February 19, 2026

యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్!

image

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

News February 19, 2026

పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

image

పాకిస్థాన్‌ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.