News January 8, 2026

క్రెడిట్ రిపోర్టులో SMA పడిందా? ఇక కష్టమే..

image

లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో కట్టకపోతే బ్యాంకులు ఆ అకౌంట్‌ను SMA (Special Mention Account)గా గుర్తిస్తాయి. ఇది మీరు దివాలా తీసే ఛాన్స్ ఉందని ఇచ్చే ఒక వార్నింగ్ బెల్. మీ బకాయి 1 నుంచి 90 రోజుల వరకు ఆలస్యమయ్యే కొద్దీ ఇది SMA-0 నుంచి SMA-2కి మారుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఒక్కసారి క్రెడిట్ రిపోర్టులో SMA పడితే భవిష్యత్తులో కొత్త లోన్లు రావడం కష్టమవుతుంది.

Similar News

News February 16, 2026

బంగారం ధర ₹లక్షకు తగ్గుతుందా?

image

అమెరికా, రష్యా మధ్య డాలర్‌తో వాణిజ్యం జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘US డాలర్‌తో ట్రేడ్‌కు రష్యా సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ చెప్పింది. అదే జరిగితే 10 గ్రాముల గోల్డ్ ₹1 లక్షకు పడిపోవచ్చు. 2027 చివరి నాటికి ₹90 వేలు-₹లక్ష మధ్య స్థిరపడొచ్చు’ అని స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలుగా ఉంది.

News February 16, 2026

T20 WCలో ఇవాళ్టి మ్యాచులు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు అఫ్గాన్‌తో UAE, 3PMకు ఇంగ్లండ్‌తో ఇటలీ, 7PMకు ఆస్ట్రేలియాతో శ్రీలంక తలపడనున్నాయి. గెలిస్తే ఇంగ్లండ్, శ్రీలంక సూపర్8కి చేరుకోనున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఓడితే అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ప్రస్తుతం ఇండియా, వెస్టిండీస్ మాత్రమే అధికారికంగా సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి.

News February 16, 2026

మాజీ ఎంపీ కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ MP తడపట్ల రత్నాబాయి(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పోలవరం(D) రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయారు. రత్నాబాయి 1972లో ఎల్లవరం(ప్రస్తుతం ర.చోడవరం) నుంచి కాంగ్రెస్ MLAగా గెలిచారు. 2008లో MPగా, 2014-20 వరకు MLCగా సేవలందించారు. అటు BC ఉద్యమ నేత, మాజీ MLC ఐలాపురం వెంకయ్య(93) అనారోగ్య సమస్యలతో నిన్న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.