News December 24, 2024

క్రైస్తవ మతం 2వేల సంవత్సరాలకు పైగా ఉంది :కలెక్టర్

image

మానవ జీవితంలో ప్రతిఒక్కరూ ఐక్యత, ప్రేమ, దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో క్రైస్తవ మతం సుమారు 2వేల సంవత్సరాలకు పైగా ఉందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 24, 2024

నెల్లూరు: ఈ-చలాన్లు చెల్లించని వారికి ALERT 

image

ఈ-చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులపై హైకోర్టు ఆదేశాలతో కొరడా ఝుళిపించేందుకు నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. తక్షణమే చలాన్లు చెల్లించకపోతే వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పోలీసు అధికారులు ఈ చలాన్లు విధిస్తుంటారు. దీంతో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News December 23, 2024

నెల్లూరు: మందల వెంకట శేషయ్య అరెస్ట్!

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి శేషయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో కాకాణి చేరుకోనున్నారు.

News December 23, 2024

వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో పూర్తి వసతులు: నారాయణ

image

వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం మౌలిక వసతుల్లో కల్పనపై అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలు గల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సంస్కరణలు తీసుకొస్తామన్నారు.