News January 1, 2026
క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్(MP)లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసే మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. DEC 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని భగీరథ్‌పుర వాసులు తెలిపారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉంది. 2వేల మంది చికిత్స పొందుతున్నారు.
Similar News
News January 30, 2026
మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ సెకండ్ ఫిల్మ్?

‘రాజాసాబ్’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరోసారి డైరెక్టర్ మారుతితో మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో హోంబలే ఫిల్మ్స్‌తో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ నిర్మాణ సంస్థతో మారుతికి అడ్వాన్స్ కూడా ఇప్పించారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News January 30, 2026
VASTHU: ఇంటి ప్రాంగణంలో ఏ చెట్లు పెంచాలంటే?

ఇంటి ప్రాంగణంలో తులసి, బిల్వం, పసుపు వంటి దేవతా వృక్షాలు పెంచాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత చేకూరుతాయని అంటున్నారు. ‘మల్లె, గులాబీ మొక్కలు పెంచాలి. వీటి పరిమళాలు మనసుకి ఆనందాన్నిస్తాయి. మనీ ప్లాంట్, తమలపాకు మొక్కలు శుభప్రదమే. అవసరాల మేర కరివేపాకు, అరటి, నిమ్మ, ఆకుకూరలు కూడా పెంచవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 30, 2026
దేశ తొలి బడ్జెట్.. విశేషాలివే

బ్రిటిష్ పాలనలో APR 7, 1860 తొలి దేశ బడ్జెట్‌ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో NOV 26, 1947న షణ్ముఖం చెట్టి బడ్జెట్ పద్దును పార్లమెంటులో వినిపించారు. AUG 15, 1947 నుంచి MAR 31, 1948 మధ్య కాలానికే దీన్ని ప్రవేశపెట్టారు.
* ఆదాయ అంచనా ₹171.15Cr(సాధారణ వసూళ్లు-₹88Cr, పోస్టు, టెలిగ్రాఫ్‌లు-₹15Cr)
* వ్యయం అంచనా ₹197.39Cr(రక్షణ-₹92Cr, మిగతా మొత్తం పౌర ఖర్చులు).
* లోటు ₹26 కోట్లు.


