News February 16, 2026
క్లోరిన్ గ్యాస్ లీకేజీపై యంత్రాగం అప్రమత్తం: కలెక్టర్

బలిజిపేట మండలం అంపావల్లిలో జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తం అయిందని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. లీకేజీ ప్రభావంతో అస్వస్తతకు గురైన ఏడుగురిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, వైద్యాన్ని అందించారన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
Similar News
News February 17, 2026
పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT
News February 17, 2026
రేపు మన్యంకొండలో మొక్కుబడి కోడదూడల బహిరంగ వేలం

మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన మొక్కుబడి కోడదూడల బహిరంగ వేలం రేపు బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం వద్ద నిర్వహించనున్నారు. ఈ వేలంలో రైతులు మాత్రమే పాల్గొనాలని ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. రైతులు పట్టా పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, రూ.10000 డిపాజిట్ చెల్లించాలన్నారు.
News February 17, 2026
NRPT: మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.


