News February 6, 2026
క్వాంటం లీడర్‌గా ఇండియా.. మేం రెడీ: CBN

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న<<19063020>> క్వాంటం వ్యాలీ<<>> ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘1990ల చివర్లో ఇండియాను IT లీడర్‌గా నిలబెట్టాం. ఇప్పుడు క్వాంటం లీడర్‌గా సూపర్ పొజిషన్‌లో ఉంచేందుకు అమరావతిలో రెడీగా ఉన్నాం. రేపు గొప్ప రోజు కానుంది’ అని పేర్కొన్నారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 2.30PMకు CBN భూమి పూజ చేస్తారు.
Similar News
News February 20, 2026
నేడు అల్పపీడనం.. వర్ష సూచన

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలోనూ వానలు పడతాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో 22వ తేదీ నుంచి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.
News February 20, 2026
యూరియా, వేపపిండిని కలిపి వాడటం వల్ల లాభాలు

సాధారణంగా పంటకు వేసిన యూరియా త్వరగా ఆవిరికావడం, నీళ్లలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని వేపపిండితో కలిపి వాడితే యూరియాలో నత్రజని నెమ్మదిగా కరిగి మొక్కలకు స్థిరంగా, ఎక్కువ కాలం పాటు అందుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నత్రజని వృథా 20-30% తగ్గుతుంది. నేల ఆరోగ్యం పెరిగి, వేరుకుళ్లు, నులి పురుగుల సమస్య తగ్గుతుంది. 50 కేజీల యూరియాకు నిపుణుల సూచనలతో 5KGల వేపపిండి కలపడం మంచిది.
News February 20, 2026
ఏఐ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో CBN భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్‌లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ ఏఐ పాలసీపై CM రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు.


