News November 6, 2025
క్వాయర్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోండి: కలెక్టర్

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ప్రాంతీయ సదస్సును గురువారం కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం నిర్వహించి మాట్లాడారు. కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగవుతుందన్నారు. కేవలం కొబ్బరికాయలు మాత్రమే విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. క్వాయర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలన్నారు.
Similar News
News November 6, 2025
ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News November 6, 2025
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎలమంచిలి (M) కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివకాల మేరకు.. S రాయవరం (M) సర్వసిద్ధికి చెందిన అడబాల సాయిరామ్ గోవింద్ బైక్‌పై వెనుక కూర్చుని గ్రామం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. సాయిరాం కింద పడిపోగా అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందు సురక్షితంగా బయటపడ్డాడు.
News November 6, 2025
సిద్దిపేట: ‘విధుల్లో అలసత్వం వద్దు’

సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్వహించిన పనితీరును(ప్రగతి) రివ్యూ నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా ఆస్పత్రుల్లో పేషెంట్లకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి అలసత్వం లేకుండా వైద్య సేవలు నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని చెప్పారు. డ్యూటీ విషయంలో సమయపాలన పాటించాలని చెప్పారు.


