News March 24, 2025

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: రాహుల్ శర్మ

image

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమన్నారు. సంక్రమిత వ్యాధుల్లో క్షయ ఒకటని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను హరించేస్తుందని తెలిపారు.

Similar News

News November 9, 2025

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 80,560 మంది దర్శించుకున్నారు. 31,195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు లభించింది. కాగా ఇవాళ సుప్రభాత సేవలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News November 9, 2025

దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

image

ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం మరోసారి హత్యతో ఉలిక్కిపడింది. వారం కింద మహిళ హత్య ఘటన మరువకముందే, శనివారం బుర్రా శ్రీనివాసరావు(45) మృతదేహం సాగర్ కాల్వలో లభ్యం కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 6న విధులు ముగించుకొని వస్తున్న శ్రీనివాసరావును, వరుసకు సోదరుడైన వ్యక్తి కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ ఘాతుకం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

News November 9, 2025

పోచంపల్లి: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

image

పోచంపల్లి మండలం జలాల్ పురంలో విషాదం జరిగింది. కొడుకు అంతక్రియలు నిర్వహించిన మూడో రోజే తండ్రి చనిపోయారు. గ్రామానికి చెందిన మహేందర్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈనెల ఆరో తేదీన చనిపోయాడు. తండ్రి గడ్డం ప్రభాకర్ గతనెల 30న వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కోతులు అడ్డుపడడంతో స్కూటీపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.