News March 23, 2025

క్షయ వ్యాధి నివారణకు కలిసికట్టుగా పనిచేయాలి: జిల్లా

image

ఈ నెల 24 న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని వైద్య సూపరింటెండెంట్‌లతో జిల్లా కలెక్టర్ ఎంఎన్‌ హరింధిర ప్రసాద్ సమావేశమయ్యారు. క్షయ వ్యాధిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి సోకిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపరాదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి కలెక్టర్ ఆఫీస్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Similar News

News March 24, 2025

విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

image

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.

News March 24, 2025

విశాఖలో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి.. కేసు నమోదు

image

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యజమానిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్‌లో నివాసం ఉంటున్న ప్రసాద్ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయగా మర్యాదగా పిలవలేదని దాడి చేసి బట్టలు విప్పి బయటకు పంపించేశారు. వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇంటి యజమాని ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News March 24, 2025

విశాఖ: మ్యాచ్‌కు ఈ వస్తువులు తీసుకెళ్లొద్దు

image

ఐపీఎల్ మ్యాచ్‌కు పలు వస్తువులను నిషేధిస్తూ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు. అగ్గిపెట్టెలు, లైటర్, మద్యం సీసాలు, గుట్కా, గాజు వస్తువులు, సెంట్ బాటిల్లు, కర్రలు, తుపాకీ, టిఫిన్లు, పెంపుడు కుక్కలు, స్ప్రేలు, విజిల్లు, కెమెరాలు, సిరంజిలు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్, ల్యాప్‌టాప్, పెన్నులు, పెన్సిళ్లు, కుర్చీలు, గొడుగులు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ నిషేధ వస్తువులపై నిఘా పెడతామని పోలీసులు సైతం తెలిపారు.

error: Content is protected !!