News February 4, 2026
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో PGRS, రీసర్వే, మ్యుటేషన్, వెబ్‌ల్యాండ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సేవలపై ఆయన సమీక్షించారు. రీసర్వే ప్రజలకు అనుకూలంగా చేపట్టాలన్నారు. E-పాస్‌బుక్స్, K-KYC, ROR కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.
Similar News
News February 11, 2026
తూ.గో: టెన్త్ పాసైనా ఉద్యోగం

ఈనెల 13న గోపాలపురం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శార్వాణి హై స్కూల్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. బుధవారం రాజమండ్రిలో JC మేఘా స్వరూప్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ చదివినవారు ఈ మేళాను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఫణి కిషోర్, జిల్లా బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ జోడాల వెంకట్ ఉన్నారు. 18 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులన్నారు.
News February 11, 2026
బెల్లంపల్లి: వాట్సాప్ స్టేటస్‌లో బ్యాలెట్ పేపర్

బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి బస్తీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ముల జయ తనయుడు సురేష్ 32వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశాడు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు. సదురు వ్యక్తిపై, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News February 11, 2026
వనపర్తి జిల్లాలో 75% పోలింగ్..!

వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, తుది నివేదికలో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని, ఖచ్చితమైన సంఖ్య కోసం పోల్ ముగింపు (End of Poll) నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.


