News July 21, 2024
క్షేత్రస్థాయి పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు!
క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.
Similar News
News November 6, 2024
సమగ్ర కుటుంబ సర్వేకు 3,964 ఎన్యుమరేషన్ బ్లాకులు: కలెక్టర్ త్రిపాఠి
కుటుంబ సర్వేకు 3,964 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. 3,483 మంది ఎన్యుమరేటర్లను నియమించామని, 349 మందిని రిజర్వులో ఉంచామని, మొత్తం 3832 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 349 మంది సూపర్వైజర్ లను, రిజర్వులో మరో 37 మందిని మొత్తం 386 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు.
News November 6, 2024
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
News November 5, 2024
SRPT: యువకుడి ఆత్మహత్య
కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.