News November 13, 2025

క్షేత్ర స్థాయి పరిశీలనలో వరంగల్ మున్సిపల్ కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి వసతులను పరిశీలించారు. 34వ డివిజన్ శివనగర్‌లో ఆమె పర్యటించి తాగునీటి సమస్య, డ్రైనేజీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించారు. డివిజన్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Similar News

News November 13, 2025

మదనపల్లెలో ఆసుపత్రుల అవినీతిపై మంత్రికి ఫిర్యాదు

image

మదనపల్లె ఆసుపత్రులపై మంత్రి సత్యకుమార్ యాదవ్‌‌కు గురువారం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ ఫిర్యాదు చేశారు. మంత్రి మదనపల్లె టమాట మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడంతో కలిశారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ కార్యకలాపాలను వివరించారు. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కుంభకోణం బయటికి రావడం, పేదతో వ్యాపారం చేస్తూ అడ్డుగోలు దోపిడీ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

News November 13, 2025

కరీంనగర్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

కరీంనగర్ పద్మనగర్ బైపాస్ రోడ్డులోని ముద్దసాని గార్డెన్స్ ముందు రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన గడ్డం ఈశ్వర్(35) స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇతడి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో లారీ టైర్ కింద పడ్డ ఈశ్వర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 13, 2025

‘ఉగ్ర’వర్సిటీ.. పేలుళ్లకు పథక రచన అక్కడే!

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్‌ అల్ ఫలాహ్ వర్సిటీ వార్తల్లో నిలిచింది. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఇక్కడి నుంచే డా.ఉమర్ నబీ, ముజమ్మిల్ పథకం రచించారు. వీరు డాక్టర్లు షాహీన్, ఆదిల్‌తో సంప్రదింపులు జరిపారు. 4 నగరాల్లో పేలుళ్లు జరపాలనుకున్నారు. కానీ ఫండ్ రైజ్ డబ్బుల విషయంలో ఉమర్, ముజమ్మిల్‌ మధ్య విభేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్లు జరగలేదు. లేదంటే మరింత మంది బలయ్యేవారేమో!