News October 23, 2025

ఖనిజ రంగంలో సింగరేణి మరో ముందడుగుదడుగు

image

ఖనిజాల రంగంలో సింగరేణి మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో ఆ ఖనిజాల గుర్తింపు, ప్లాంట్ నిర్మాణంపై గురువారం కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ ఎన్ఎఫ్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఅండ్‌ఎండీ బలరామ్ మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకొని ఉత్పత్తి చేసేందుకు కొత్తగూడెంలో ప్రయోగాత్మక ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News October 24, 2025

సిరిసిల్ల: ‘ప్రతి పేద మహిళ సంఘాల్లో చేరాలి’

image

జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ కోరారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా దివ్యా దేవరాజనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.

News October 24, 2025

PDPL: ‘2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్లు’

image

లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఆస్‌బయోటెక్‌, విక్టోరియా ప్రభుత్వ నిర్వహణలో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో PDPL జిల్లాకు చెందిన IT మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. లైఫ్‌ సైన్సెస్‌లో 2030 నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి, 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 24, 2025

తిరుమలకు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ RRR

image

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా గాయత్రి అతిథి భవనం వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారి ఓఎస్‌డీ సత్రే నాయక్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన రాత్రి తిరుమలలో బస చేసి శుక్రవారం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు.