News March 1, 2026
ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్లు పేర్కొంది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్లు తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనాయకులు అందరూ ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని వెల్లడించింది.
Similar News
News March 1, 2026
భారత్‌లో ఖమేనీ పర్యటన.. ఎప్పుడో తెలుసా?

ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అవ్వకముందు భారత్‌లో పర్యటించారు. 41 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1980-81లో ఆయన కర్ణాటక, కశ్మీర్‌కు వచ్చారు. బెంగళూరుకు 75 కి.మీ. దూరంలోని అలీపుర్‌లో ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడ షియా ముస్లింల జనాభా అధికం. ఇక శ్రీనగర్‌లోని ఓ మసీదులో ప్రసంగించారు. మహత్మా గాంధీ, నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలను ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించి కొనియాడారు.
News March 1, 2026
ఫోన్‌లో సిమ్ ఉంటేనే ఈ యాప్స్ పనిచేస్తాయి!

ఇవాళ్టి నుంచి కొత్త టెలికం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కచ్చితంగా లింక్ అయి ఉండాలి. 6 గంటలకు ఒకసారి యాప్‌లు మీ ఫోన్‌లో సిమ్ ఉందో లేదో చెక్ చేస్తాయి. ఒకవేళ సిమ్ తీసివేస్తే అవి పనిచేయవు. అలాగే ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి రీఅథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.
News March 1, 2026
తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.


