News March 1, 2026
ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్‌కు IRGC వార్నింగ్

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
Similar News
News March 1, 2026
BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్‌లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.
News March 1, 2026
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

TG: సీఎం రేవంత్‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.
News March 1, 2026
విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI

AP: మధ్యవర్తిత్వం వహించేవారిపై ఇరుపార్టీలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే వారి మధ్య ఏర్పడ్డ న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయని CJI జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో ‘మధ్యవర్తిత్వం’పై జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్బిట్రేటర్ల నియామకమూ అలాగే ఉండాలన్నారు. సమస్య పరిష్కారానికి పార్టీల మధ్య జరిగిన ఒప్పందాలను వేగంగా, సక్రమంగా అమలు చేసేలా యంత్రాంగమూ ఉండాలని పేర్కొన్నారు.


