News April 12, 2025
ఖమ్మంకు సీఎం రేవంత్ ..?

ఖమ్మం రూరల్ రెడ్డిపల్లిలో రేపు వనజీవి రామయ్య అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా వనజీవి రామయ్యకి నివాళులు అర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
Similar News
News April 16, 2026
ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్‌ను సత్కరించారు.
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.