News April 8, 2025

ఖమ్మంలో ఈ నెల 9న జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగం అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News April 8, 2025

కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 పోస్టుల ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జరిగింది. ఎస్ఐ నాగుల్ మీరా తెలిపిన వివరాలిలా.. కారేపల్లి మండలం చేన్నంగులగుట్టకు చెందిన డి.సురేశ్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య మందలించడంతో ధనియాలపాడులోని ఓ జామాయిల్ తోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 8, 2025

ఖమ్మం: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!

image

మహిళ క్షణికావేశంలో ఓ వ్యక్తిని నెట్టివేయడంతో గోడకు తగిలి మృతిచెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖానాపురం పోలీసుల వివరాలిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి చెందిన రవిప్రసాద్ గత కొద్దిరోజులుగా ఖమ్మం నగరంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. రవిప్రసాద్‌ను పక్కకు నెట్టివేయడంతో తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!