News April 7, 2025
ఖమ్మంలో ఏలూరు జిల్లా వాసి మృతి

ఖమ్మం పట్టణం నేతాజీనగర్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చింతలపూడికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా ఓ మహిళతో నేతాజీ నగర్‌లో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరిద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరగడంతో రవిప్రసాద్‌ను సదరు మహిళ గోడకు నెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
BREAKING: ఒకేరోజు రూ.10,000 తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.10,000 పడిపోవడంతో రూ.2,90,000 పలుకుతోంది. అటు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400 ఎగసి రూ.1,48,300 పలుకుతోంది.
News February 24, 2026
అనంతపురం: భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన అనంతపురంలో మంగళవారం జరిగింది. పాతూరులో నివాసం ఉంటున్న గౌరమ్మ తలపై భర్త నాగభూషణం కొడవలితో తీవ్రంగా దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరమ్మ చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగభూషణంను అదుపులోకి తీసుకున్నారు.
News February 24, 2026
ఖమ్మం: ‘నకిలీ’ ఉచ్చు.. కల్తీ దందాను అరికట్టేదెవరు?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ, కల్తీ వస్తువుల దందా విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యావసరాల నుంచి మందులు, విత్తనాలు, వరకు అన్నింటికీ నకిలీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాండెడ్ పేర్లతో తక్కువ ధరకు నాసిరకం వస్తువులను అంటగడుతూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్తీ రాజ్యం మరింత విస్తరిస్తోంది.


