News October 27, 2025
ఖమ్మంలో క్లాక్ టవర్.. స్పెషాలిటీ ఇదే

ఖమ్మానికి కొత్తశోభ రానుంది. నగరంలోని ఇల్లందు క్రాస్‌రోడ్‌లో రూ. 1.25కోట్లతో క్లాక్ టవర్ నిర్మించనున్నారు. నిర్మాణానికి ప్రపంచగుర్తింపు పొందిన బ్లాక్ గ్రానైట్ రాయిని ఉపయోగించడంతో పాటు స్తంభాద్రి నరసింహస్వామి, ఖిల్లా, ఇతర చారిత్రక అంశాలు ప్రతిబింబించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయితే నగరానికి ల్యాండ్ మార్క్‌గా నిలవనుంది. ఇప్పటికే నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
Similar News
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్‌కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.
News October 27, 2025
నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.


