News March 24, 2024
ఖమ్మంలో తల్లిని హత్య చేసిన కొడుకు

ఖమ్మం రామన్నపేట కాలనీలో దారుణం జరిగింది. గంజాయి, మద్యం మత్తుకు బానిసైన కొడుకు తల్లిని కిరాతకంగా హతమార్చాడు. మృతురాలు గౌరీపెద్ది రామలక్ష్మి(మీరాబి) వికలాంగురాలు. ఆమెకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. తల్లిని కర్రతో తలపై బాధడంతో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 21, 2026
హాల్‌టికెట్లలో తప్పులుంటే సంప్రదించండి: ఖమ్మం డీఐఈఓ

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని డీఐఈఓ రవి బాబు తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.
News February 21, 2026
ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.
News February 21, 2026
స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: ఖమ్మం డీఆర్డీవో పీడీ

స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.


