News April 18, 2024
ఖమ్మంలో తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి రోజు ఒక నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17- ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
Similar News
News January 11, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు పొంగులేటి పర్యటన
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రకటనలో తెలిపారు. ‘ఉ.10 గంటలకు ఖమ్మం దానవాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. 11:45కు ఖమ్మం(R) పోలెపల్లిలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. అనంతరం మ.12:30కు మీడియా ఉంటుంది. సా.5 గంటలకు కొత్తగూడెం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తార’ని పేర్కొన్నారు.
News January 11, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు 20న కేంద్ర బృందం రాక
భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు పర్యవేక్షణకు ఈ నెల 20న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరగా, స్పందించారని వివరించారు. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో అనువైన భూముల పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విమానాశ్రయం నిర్మాణంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
News January 10, 2025
భద్రాద్రి: వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: కలెక్టర్
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించారని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.