News January 2, 2026
ఖమ్మంలో త్వరలో ‘హరిత’ హోటల్.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. పర్యాటకులకు నాణ్యమైన భోజనం, విడిది సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో కూడిన అనువైన స్థలాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 5, 2026
ఖమ్మంలో తగ్గిన కోడిగుడ్ల ధరలు..!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.38, వంకాయ 26, బెండకాయ 40, పచ్చిమిర్చి 38, కాకర 46, కంచకాకర 50, బోడకాకర 140, బీరకాయ 50, సొరకాయ 26, దొండకాయ 46, క్యాబేజీ 24, ఆలుగడ్డ 24, చామగడ్డ 28, క్యారెట్ 40, బీట్ రూట్ 24, కీరదోస 26, బీన్స్ 56, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
News January 5, 2026
ఖమ్మంలో ఈ నెల 10 నుంచి టీసీసీ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News January 5, 2026
పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.


