News April 13, 2025
ఖమ్మంలో నేడు ఎంపీ పర్యటన వివరాలు

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వైద్యుల పునశ్చరణ తరగతుల శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి లో పద్మశ్రీ వనజీవి రామయ్య అంతిమయాత్రలో పాల్గొంటారని చెప్పారు
Similar News
News November 4, 2025
అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని చెప్పారు. మిల్లులకు చేరిన లోడును తడవక ముందే వెంటనే దింపుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు.
News November 4, 2025
సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా వసంతరావు

సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ వసంతరావును నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టియాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవోగా పనిచేస్తున్న వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల డిప్యూటీ వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
News November 4, 2025
లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు: ప్రకాశ్‌రాజ్

లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్‌గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.


