News March 12, 2026
ఖమ్మంలో ‘మాంగళ్య’.. ముఖ్య అతిథిగా శ్రీలీల

వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ తన 30వ బ్రాంచ్‌ను ఈ నెల 13న(రేపు) ఖమ్మంలో ప్రముఖ సినీనటి శ్రీలీలతో ప్రారంభించనున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అత్యాధునిక వెడ్డింగ్ కలెక్షన్లతో పాటు అన్ని వయసుల వారికి నచ్చే లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ ప్రజలకు మంచి షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 13, 2026
ఖమ్మం: నేటి నుంచే రీకౌంటింగ్ దరఖాస్తులు

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

ప్రజా సేవలోనే ప్రాణ త్యాగం.. నేడు శ్రీపాదరావు వర్ధంతి

గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎదిగిన శ్రీపాదరావు ప్రజాసేవలోనే ప్రాణత్యాగం చేశారు. 1999, ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు శ్రీపాదరావును కాల్చి చంపడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ సంఘటన జరిగి 27 ఏళ్లు గడిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు శ్రీపాదరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.