News January 8, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

ఖమ్మం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్ తెలిపారు. ఫార్మసీ కోర్సులు చేసిన వారితో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు కూడా హాజరుకావచ్చు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు మేళాకు రావాలని ఆయన కోరారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.
News February 8, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10న ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం టేకులపల్లి ITI మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 21-35 సం.ల వయస్సు, ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షలు ఉంటుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 8, 2026
ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్‌పై వస్తుండగా.. జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


