News January 26, 2025

ఖమ్మంలో రోజూ 69వేల మంది మహిళల ప్రయాణం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి రోజు సుమారు 69 వేలకు పైగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రూ.21,31,00,000 సబ్సిడీని ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు 7,53,723 సిలిండర్లను రూ.500కే సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి నెలా దాదాపు రూ.10 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించి 2,57,995 గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

News February 21, 2026

హాల్‌టికెట్లలో తప్పులుంటే సంప్రదించండి: ఖమ్మం డీఐఈఓ

image

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని డీఐఈఓ రవి బాబు తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.

News February 21, 2026

ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

image

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.