News February 26, 2025
ఖమ్మం: అమ్మమ్మ ఊరికి వస్తే.. బైక్ కాల్చేశారు!

రాత్రి పడుకునే ముందు ఇంటి ముందు పెట్టిన బైక్.. మరునాడు తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన ఘటన తిరుమాలయపాలెం మండలం బచ్చోడులో జరిగింది. పోలీసుల వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లికి చెందిన నవిల యాకస్వామి తన అమ్మమ్మ ఊరు బచ్చోడకు వచ్చాడు. మరునాడు ఉదయం బైక్ కాల్చివేసినట్లు ఫిర్యాదు చేయడంతో తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 26, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

> జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు
> చింతకాని మండలం నేరడలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటన
> వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
> కల్లూరులో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
News February 26, 2025
కూసుమంచి : రూ. 90 లక్షల విలువైన 179 కేజీల గంజాయి పట్టివేత

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 90 లక్షల విలువైన 179 కేజీల గంజాయితో పాటు 41 గ్రాముల బంగారం కారులో తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం డీసీపీ ప్రసాదరావు తెలిపారు.
News February 26, 2025
ఖమ్మం: మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మార్చి 10 వరకు పొడిగించామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసి విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 ఫీజు నిర్ధారించామని పేర్కొన్నారు.