News August 18, 2024
ఖమ్మం: అర్హులైన గిరిజనులకు పోడు భూముల హక్కులు

పోడు భూములలో వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించేందుకు విధి విధానాలపై రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి ధనసరి అనసూయ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News November 6, 2025
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ పంట శిక్షణ కార్యక్రమంలో అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలను అందిస్తుందని, ఎటువంటి నష్టం సంభవించదని తెలిపారు. రైతులకు అంతర్ పంటల ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి మధుసూదన్ పాల్గొన్నారు.
News November 6, 2025
ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్‌కు తాళం

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్‌కు తాళం వేసినట్లు సమాచారం.
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.


