News July 4, 2025
ఖమ్మం: ఆయిల్‌పామ్ సుంకంపై కేంద్రమంత్రికి తుమ్మల లేఖ

ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్రం మే 31న ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొస్తారని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
జగిత్యాల : ‘CMR బకాయిలు వెంటనే చెల్లించండి’

యాసంగి 2023–24 సీజన్‌కు సంబంధించి మిల్లర్లు జులై 27 లోగా CMR బకాయిలను చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. JGTL సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక చెల్లింపుల గడువు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. పౌరసరఫరాల అధికారులు, FCI, SWC అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
News July 4, 2025
జగిత్యాల: ‘మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం అయన సందర్శించారు. ఈ సందర్భంగా భోజనం నిర్వహణను, వంట సరుకుల నాణ్యతను, బియ్యం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేశారు. ఆయన వెంట ఆర్డీఓ మధుసూదన్ తదితరులున్నారు.
News July 4, 2025
వనపర్తి: ‘గురుకుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించండి’

ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను, జగత్పల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్, నాగవరంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే స్కూళ్లను తనిఖీ చేశారు.