News November 29, 2025
ఖమ్మం: ఆ గ్రామం అందరికీ ఆదర్శం..!

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఓటింగ్ పై స్థానిక యువత అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. ప్రతి ఓటు విలువైనదని, ఓటు వేయడం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎంచుకోవచ్చని, అభివృద్ధి, పారదర్శకత, గ్రామ సమస్యల పరిష్కారం ఇవన్నీ ఓటర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లోనే ఉందంటూ సూచిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ST,STలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: కలెక్టర్

ST,STలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి DVMC సమావేశం జరుగుతుందన్నారు.పాత కమిటీ గడువు ముగిసినందున కొత్త సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు
News December 4, 2025
PHOTO: 25 ఏళ్ల క్రితం పుతిన్‌తో మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ 25 ఏళ్ల క్రితంనాటి ఓ ఫొటో వైరలవుతోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి గుజరాత్ సీఎం హోదాలో మోదీ మాస్కో పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల అగ్రనేతల భేటీ సమయంలో.. అక్కడ మోదీ కూడా ఉన్న ఫొటో తాజాగా బయటకొచ్చింది. దీనిని చూస్తూ.. మోదీ, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహబంధం దాదాపు 25 ఏళ్ల నాటిదని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు.
News December 4, 2025
కామారెడ్డి: కలెక్టర్‌ను కలిసిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఆఫీసర్

సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో జోనల్-2 పరిధిని జోనల్-3కి మార్చిన సందర్భంగా జోనల్-8 ఆఫీసర్ ప్రత్యూష గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కలెక్టర్‌కు పూల మొక్కను అందించారు. పాఠశాలల్లో నూతనంగా జరిగిన జోన్ల మార్పిడికి సంబంధించిన వివరాలను ప్రత్యూష కలెక్టర్‌కు వివరించారు.


