News March 3, 2026
ఖమ్మం: ఆ తండాలో 3 రోజులు హోలీ సంబరాలు

కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ఉట్టి పడే విధంగా హోలీ వేడుకలు ఉంటాయి.
Similar News
News March 3, 2026
పార్వతీపురం: ‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలకు క్యాన్సర్ నిర్ధారిత టెస్టులు, అవగాహన కల్పించారు. మహిళలు శారీరకంగా, మానసికంగా అన్ని సమస్యలను ఎదుర్కొని ముందంజలో ఉండాలని సూచించారు. ఆర్థికంగా ఎదిగి మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్నారు.
News March 3, 2026
మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్‌లు తప్ప హబ్‌లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
News March 3, 2026
ప్రొద్దుటూరులో తగ్గిన బంగారం ధర

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,700
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,364
* 10 గ్రాముల వెండి ధర రూ.2,800.
నిన్న 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.17,000 ఉండగా నేడు రూ.300 తగ్గి రూ.16,700కు చేరింది.


